ఏపీ వాసులకు అలర్ట్‌: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు | Weather Alert: 98 Mandals Severe Heat Wave In Ap | Sakshi
Sakshi News home page

ఏపీ వాసులకు అలర్ట్‌: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు

Apr 19 2023 7:44 AM | Updated on Apr 19 2023 11:02 AM

Weather Alert: 98 Mandals Severe Heat Wave In Ap - Sakshi

రాష్ట్రంలోని 29 మండలాల్లో మంగళవారం తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 17 మండలాల్లో వడగాడ్పులు వీచాయని చెప్పారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 29 మండలాల్లో మంగళవారం తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 17 మండలాల్లో వడగాడ్పులు వీచాయని చెప్పారు. కాకినాడ జిల్లాలో 2, కృష్ణా 1, నంద్యాల 2, విశాఖ 2, విజయనగరం 2, వైఎస్సార్‌ జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచినట్లు పేర్కొన్నారు.

మరో 110 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా కడప పట్టణంలో 44.7, నంద్యాల జిల్లా ఆత్మకూరు, గోస్పాడులో 44.5, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం, కర్నూలు జిల్లా మంత్రాలయం, పార్వతీ­పురం మన్యం జిల్లా సాలూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల  ప్రకారం బుధవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అంబేద్కర్‌ తెలిపారు.
చదవండి: ప్రభుత్వ స్కూళ్లలో నైట్‌ వాచ్‌మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ.. గౌరవ వేతనం ఎంతంటే?  

Advertisement
 
Advertisement
Advertisement