‘అన్ని రకాల ప్రయోజనాలతో రైతులను ఆదుకుంటాం’ | We Will Support Farmers With All Kinds Of Benefits Kottu Satyanarayana | Sakshi
Sakshi News home page

‘అన్ని రకాల ప్రయోజనాలతో రైతులను ఆదుకుంటాం’

May 8 2023 5:03 PM | Updated on May 8 2023 5:06 PM

We Will Support Farmers With All Kinds Of Benefits Kottu Satyanarayana - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం:  కోసిన ధాన్యం కోసినట్లుగా కొనుగోలు చేసి ,రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని ,రైతులు ధైర్యంగా ఉండాలని ఉప ముఖ్య మంత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు.సత్యనారాయణ  స్పష్టం చేశారు. 

 సోమవారం తాడేపల్లిగుడెం మండలం నందమూరు ,కృష్ణయ్య పాలెం గ్రామాలలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు తో కలసి కొట్టు.సత్యనారాయణ పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో వారు మాట్లాడి ,వారికి భరోసా ఇచ్చారు.
 
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంటలు బాగా పండాయి ఏకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుమతి అవుతున్నాయి ,సగం పైగా కోతలు అయ్యాయి మిగతావి కోతలు అయ్యే లోపు అకాల వర్షాలు కురిశాయన్నారు. అయినా కూడా ఏ రైతు ఇబ్బంది గాని నష్ట పోకూడదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలని ఆదేశించారని, అదే సమయంలో సకాలంలో డబ్బులు నేరుగా బ్యాంక్‌లో జమ చేయమని జిల్లా యంత్రాంగం కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కాలం కలసి రాకపోయినా ప్రభుత్వం అన్ని రకాలు ప్రయోజ నాలు కల్పించి ,రైతులను ఆదుకుంటున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి రైతులకు ఇన్సూరెన్స్ చేశామని నష్టపోయినప్పుడు అదే నెలలో ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని అయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడు నందమూరు కు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి , తన ఉనికి కోసమే ప్రయాస పడుతున్నారన్నారు. ముఖ్య మంత్రిగా పద్నాలుగు  సంవత్సరాలు చేసిన  కాలంలో ఏనాడైనా ,  ఏ సంవత్సరం అయినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని ఎటువంటి మేలు చేశారా అని మంత్రి అన్నారు.  

అకాల వర్షాలు పడినప్పుడు నుండి మంత్రులు, ప్రజాప్రతి నిధులు ,జిల్లా అధికారులు    రాత్రి అనక పగల అనక  క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులను కలసి మాట్లాడి, ధైర్యం చెప్పి ధ్యానం కొనుగోలు పైనే ప్రధాన దృష్టి పెట్టామని అయన అన్నారు.మీరు వ్యవసాయం దండగ అన్నారు, మేము పండగ అని అందుకు అనుగుణంగా రైతుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి రైతన్నకు బాసటగా నిలిచామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. సత్యనారాయణ అన్నారు.

రాష్ట్ర పౌర సరఫరాలు,వినియోగ దారుల శాఖ  మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా, దళారీ వ్యవస్థ లేకుండా, రైతులకు, మిల్లులకు  సంబంధం లేకుండా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ద్వారానే ప్రతి గింజను కొంటున్నామన్నారు.  ధాన్యం కొనుగోలు కి 850 కోట్లు చెల్లించామని, ఇంకా ఎంత కొన్నను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.మొన్న ఆకుతీగ పాడు గ్రామం కు , వ్యవసాయ శాఖ కమిషనరు, జిల్లా జాయింటు కలెక్టరుతో పర్యటించామని ధాన్యం  కొనుగోలు తర్వాత  సకాలంలో  డబ్బులు జమ అయ్యాయని రైతులు చెప్పారని మంత్రి అన్నారు.

నందమూరు కు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆయన చెప్పే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని , ఆయన హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని ఏటువంటి ప్రయోజనాలు రైతులకు కల్పించలేదన్నారు. ఆనాడు కాల్దారి కాల్పులకు  ప్రతిపక్ష నాయకులు కరాకులని, రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

రైతులు ఆర్బికే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లవ లసిన అవసరం లేదన్నారు.అకాల వర్షంతో   రైతుల వద్ద  ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు ఏవ్వరూ ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, నిబంధనకు వ్యతిరేకంగా నిర్వహించిన 12 రైస్ మిల్లులను సీజ్ చెయ్యడం జరిగిందన్నారు. రైతులు  మంచి పంటలు వేసుకో వాలని మంచి దిగుబడులు రావాలని రైతులు ఆనందంగా  ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం అని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి. వెంకట నాగేశ్వరావు రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement