‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Volunteer Ki Vandanam Honorary Awards Presentation Vijayawada Updates - Sakshi

Updates:
‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌
ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు.

వాలంటీర్లు.. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధులు: సీఎం జగన్‌
సంక్షేమ సారథులు వాలంటీర్లు
సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందిస్తున్నారు
ప్రతి నెలా 1న 64 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్న సైనికులే వాలంటీర్లు
2..66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేస్తున్నారు
కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి
90 శాతం గడపలకు వెళ్లి పెన్షన్‌ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు
అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా వంటి పథకాలను అందిస్తున్నారు.
గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు
పెన్షన్‌తో పాటు రేషన్‌ డోర్‌ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు అదేలా వాలంటీర్ల సేవలు

వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు
25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు
డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం
నాన్‌ డీబీటీ కలిపితే మొత్తం రూ.3లక్షల కోట్లు అందించాం
ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజాలు చెప్పగలిగిన సత్యసారథులు వాలంటీర్లే
ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు
మంచి చేశాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నాం.
వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట

జగనన్న సైనికులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం: వాలంటీర్లు
మా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వాలంటీర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.ప్రజల చిరునవ్వులు, ఆశీర్వాదాలే మాకు కొండంత బలం. జగనన్న సైనికులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం’’ అని వాలంటీర్లు అన్నారు.

వాలంటీర్ల సేవలు అభినందనీయం: మంత్రి సురేష్‌
ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. చిట్ట చివరి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడమే సీఎం లక్ష్యం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, వరదల సమయంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు.

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌తోనే సాధ్యం​: మంత్రి ముత్యాల నాయుడు
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌తోనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. ప్రతి గడపకు వెళ్లి వాలంటీర్లు సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా వాలంటీర్ల కృషి చేసున్నామని మంత్రి అన్నారు.

‘వాలంటీర్ల వందనం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

విజయవాడ బయల్దేరిన సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ బయల్దేరారు. కాసేపట్లో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వరుసగా మూడో ఏడాది ఉత్తమ వాలంటీర్లకు అవార్డులు ప్రదానంతో పాటు సత్కరించనున్నారు. వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు అందజేయనున్నారు.

ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శ్రీకారం చుడుతు­న్నారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారం­భించనున్నారు.

తూర్పున సూర్యుడు ఉదయించక­ముందే.. ఆది­వారం అయినా, పండగైనా, సెలవు రోజైనా.. వర్షం పడుతున్నా.. అవాంతరాలను లెక్కచేయక ప్రతి నెలా మొదటి తారీఖునే వలంటీర్లు చిరునవ్వుతో సామాజిక పింఛన్లు అందజేస్తున్నారు.

ఠంఛన్‌గా అవ్వాతాతల గడప వద్దకు వచ్చి, తలుపు తట్టి, ఆప్యాయంగా పలకరించి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడం, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చేయి పట్టుకొని నడిపిస్తూ, ప్రతి 50 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు.

లంచాలు, వివక్షకు తావులేకుండా సేవా భావంతో సేవలందిస్తున్న వలంటీర్‌ చెల్లెమ్మలకు, వలంటీర్‌ తమ్ముళ్లకు సెల్యూట్‌ చేస్తూ వారి సేవలను గుర్తించి, ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా మూడేళ్లుగా ఈ సత్కారం చేస్తున్న విషయం తెలిసిందే.

పనితీరే ప్రామాణికం
► అవినీతికి తావు లేకపోవడం, సచ్ఛీలత, ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. 

► రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు అందజేస్తారు. నేడు అందిస్తున్న ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం వెచ్చించింది. 

► గ్రామ/వార్డు వలంటీర్లు తమ పరిధిలోని 50–100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు, అనినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సహాయకారిగా వ్యవహరించినందుకు ఈ పురస్కారాలను అందజేస్తోంది. 

► వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ‘దిశ’ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు, జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజలకు వివరించి, అర్హులైన వారితో దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు ఈ సత్కారం చేస్తోంది. 

సేవా సైన్యానికి సలాం 
మే 19వ తేదీ నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలవ్వనుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 

సేవా వజ్ర
సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.30,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్లకు.. మొత్తంగా 175 నియోజకవర్గాల్లో 875 మందికి సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు. 

సేవా రత్న
సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌–1 ర్యాంకు సాధించిన వలంటీర్లకు.. మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాల అందజేస్తారు.

సేవా మిత్ర
సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.10,000 నగదు బహుమతి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top