యువ లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. వీడియో వైరల్‌ | Video Viral: AP High Court Judge Anger On Young Lawyer | Sakshi
Sakshi News home page

యువ లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. వీడియో వైరల్‌

May 6 2026 6:39 PM | Updated on May 6 2026 7:56 PM

Video Viral: AP High Court Judge Anger On Young Lawyer

ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ యువ న్యాయవాదిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్‌రావు.. ఓ యువ న్యాయవాది చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా పోలీసు కస్టడీకి పంపాలంటూ ఆదేశించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బీసీఐ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌కు లేఖ రాసినట్లు బార్‌ అండ్‌ బెంచ్‌ పేర్కొంది. ఆ యువ న్యాయవాది చేతులు జోడించి సారీ.. క్షమించాలంటూ వేడుకుంటుండగా.. న్యాయమూర్తి ఆగ్రహంతో పోలీసులను చర్య తీసుకోవాలని ఆదేశిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది.. ఆ కస్టడీ ఉత్తర్వు అమలులోకి రాకముందే బార్ అసోసియేషన్ జోక్యంతో దానిని ఉపసంహరించుకున్నారు.

ఇది యువ న్యాయవాదులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అన్నారు. చివరికి బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement