తిరుపతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.
ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వేస్ట్ అని, ఆయన చెప్పింది.. ఏనాడు చేయలేదని శ్రీధర్ వ్యాఖ్యానించిన వీడియోను బయటపెట్టింది. ఆ వీడియోలో చంద్రబాబును అరవ శ్రీధర్ ఏకవచనంతో సంబోధించినట్లు తెలుస్తోంది.


