
ఐఆర్ లేదు.. పీఆర్‌సీ ఊసేలేదు
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని, వారికిచి్చన 9 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారం చేపట్టాక ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వారిని హీనాతిహీనంగా, దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వలంటీర్ల మాదిరిగా ఇంటింటికీ తిప్పుతూ పని చేయిస్తున్నారని, అంత పని చేయించుకుని ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో ఘోరంగా అవమానిస్తున్నారని తెలిపారు. పోలీసులపై కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, డీజీ స్థాయి అధికారులతో సహా అనేక మంది పోలీసులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను గతంలో ఎన్నడూ లేనంత నీచస్థాయికి దిగజార్చారని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదన్నారు.
మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని ఇవ్వలేదని.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్‌సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో కొత్త పీఆరీసీ కమిషన్‌ను నియమించలేదని రెప్పారు. ఏడాది గడిచినా ఐఆర్ ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలోనే 27 శాతం ఐఆర్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని వాపోయారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.22 వేల బకాయిల్ని పట్టించుకోవడంలేదని, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు.
ఆప్కాస్ కింద భద్రంగా ఉన్న అవుట్‌సోరి్సంగ్ ఉద్యోగులను మళ్లీ ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లో పెట్టి దోపిడీకి గురి చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఏకంగా వాళ్ల ఉద్యోగాలు తీసివేశారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. వెంటనే ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాలని వెంకట్రావిురెడ్డి డిమాండ్ చేశారు.