ఏపీ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు లొంగిపోయారు. మరో ఏడుగురు మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నారాయణరావు పనిచేశారు. మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ, జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను అణిచి వేసేందుకు భారత ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే దీని లక్ష్యం. ఇందుకు భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి.
ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్‌లో భధ్రతా బలగాలు విజయం సాధించారు. మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర సర్కారు పెట్టుకున్న గడువు రేపటితో ముగియనుండడంతో తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.


