తిరుపతి క్రైం: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని పిన్ని, బాబాయి ఇంటికి వచ్చిన బాలిక (16)కు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. తండ్రి వరుసయ్యే బాబాయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడికి అతని భార్యే సహకరించడంతో బాలిక నిస్సహాయురాలిగా మారింది. ఆ దంపతులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి గురువారం తిరుపతి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.
తెలంగాణ రాష్ట్రం జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో వేసవి సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాలిక బాబాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలితో ఫోన్, చాట్ యాప్స్ ద్వారా జరిపిన సంభాషణలు, కలిసి దిగిన ఫొటోలను తన వద్ద ఉంచుకుని, తాను పిలిచినప్పుడు రాకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
కొద్దిరోజుల తరువాత జగద్గిరిగుట్టకు వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీచేశారు. నిందితుడిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
దర్యాప్తులో ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఆమె తిరుపతి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ, కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరినీ 21వ తేదీ సాయంత్రం అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
దళిత బాలికపై లైంగిక దాడికి యత్నం
పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు
పాయకరావుపేట: హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయ
తి్నంచారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి బాధితురాలి తల్లి తెలిపిన వివరాలు... పాయకరావుపేటలోని తల్లితో కలసి 11 ఏళ్ల దళిత బాలిక నివాసం ఉంటోంది. తన కుమార్తె సెల్‌ఫోన్ దొంగిలించిందని ఆరోపిస్తూ ఈ నెల 17న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని కొబ్బరితోటలోకి తీసుకెళ్లి ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ గోర్లతో రక్కి అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలి తల్లి తెలిపింది.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారని పేర్కొంది. ఇంటికి వచ్చిన తన కుమార్తె శరీరంపై గాయాలు చూసి అడిగితే జరిగిన దారుణాన్ని తెలియజేసిందని చెప్పింది. తన కుమార్తెపై లైంగిక దాడికి ప్రయతి్నంచినవారిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించింది. కాగా, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పొంతనలేని పోలీసుల ప్రకటనలు
ఈ విషయంలో పోలీసు అధికారుల ప్రకటనలకు పొంతనలేకపోవడం పలు అనుమానాలకు దారిస్తోంది. ‘బాలికపై లైంగిక దాడికి ప్రయత్నం జరగలేదు. బాలికకు ఇచ్చిన సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో బలవంతంగా తీసుకున్నందున లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఆమె కుటుంబ సభ్యులు తప్పుడు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది’ అని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేశారు.
అయితే, సెల్‌ఫోన్ దొంగిలించిందన్న నెపంతో కంటోన్మెంటుకు చెందిన 11 ఏళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు ఈ నెల17వ తేదీన కొబ్బరితోటలోకి తీసుకెళ్లి కొట్టడంతోపాటు ప్రైవేటు పార్ట్‌లను తాకినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిందని సీఐ శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై క్రైమ్ నంబరు137/26/ సెక్షన్ 74, 79, 351 ఆర్/డబ్ల్యూ 3, 7 ఆర్/డబ్ల్యూ8ఆర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.


