తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On July 21 2024 | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Jul 21 2024 7:57 AM | Updated on Jul 21 2024 7:58 AM

Tirumala TTD Latest News Updates On July 21 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5  గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న (శనివారం) 83,538 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 30,267 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం  4.25  కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement