అపహాస్యం: మాజీ మంత్రి సైతం పచ్చ కండువాతోనే.. | TDP Mocking Non Party Elections | Sakshi
Sakshi News home page

పార్టీ రహిత ఎన్నికలను అపహాస్యం చేస్తున్న టీడీపీ

Feb 5 2021 9:19 AM | Updated on Feb 5 2021 11:32 AM

TDP Mocking Non Party Elections - Sakshi

వి.కోట(చిత్తూరు జిల్లా): పార్టీలకు రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను టీడీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారు. పార్టీ రంగులతో కూడిన కండువాలు ధరించి, పార్టీ పతాకాలను చేతబట్టి ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో వి.కోట మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా లావణ్య పేరు ఖరారైంది. దీంతో గురువారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ మండల నేతలు టీడీపీ రంగుతో కూడిన కండువాలు ధరించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో బాధ్యతాయుత పదవి చేపట్టిన ఓ మాజీ మంత్రి ఇలా రాజ్యాంగ విలువలకు తిలోదకాలివ్వడాన్ని చూసి ప్రజలు విస్తుబోతున్నారు.(చదవండి: డబ్బులిస్తాం.. మా వెంట రండహో!)  

Advertisement
 
Advertisement
Advertisement