కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల? | Sub jail officials huge demands | Sakshi
Sakshi News home page

కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల?

Feb 14 2025 5:23 AM | Updated on Feb 14 2025 5:23 AM

Sub jail officials huge demands

బెయిల్‌ పొందిన ఖైదీలను డిమాండ్‌ చేసిన పెనుకొండ సబ్‌జైలు అధికారులు!

పెనుకొండ: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించడం లేద­న్నట్లుగా ఉంది పెనుకొండ సబ్‌జైలు అధికారుల తీరు. రిమాండ్‌ ఖైదీలకు కోర్టు బెయిల్‌ ఇచ్చినా... విడుదలకు మాత్రం సబ్‌­జైలు అధికారులు భారీగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల ఒకే ఊరికి చెందిన కొందరు రిమాండ్‌ ఖైదీలను విడుదల చేసేందుకు రూ.8 వేల విలువైన కుర్చీ డిమాండ్‌ చేశారు. దీంతో వారి బంధువులు కుర్చీ కొని సబ్‌జైలు వద్ద సిబ్బందికి ఇవ్వగా, వారు తీసు­కువెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

కొత్తచెరువు మండలానికి చెందిన కొందరిని నెల రోజుల క్రితం పోలీసులు ఓ కేసులో అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరి­చారు. జడ్జి వారికి రిమాండ్‌ విధించడంతో పెనుకొండ సబ్‌జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం వారికి బెయిల్‌ లభించగా, ఆ పత్రాలను తీసుకుని ఖైదీల బంధువులు సబ్‌జైలుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది సబ్‌జైలుకు రూ.8 వేల విలువైన కుర్చీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో రిమాండ్‌ ఖైదీల బంధువులు ఆ కుర్చీ కొనుగోలు చేసి సబ్‌ జైలుకు తీసుకువచ్చి అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement