సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబు సభ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను తరలించడం వల్ల సాధారణ ప్రయాణికులు, ముఖ్యంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, బస్సుల కోసం గంటల కొద్ది బస్ స్టాప్‌ల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది.
అర కొర బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో, గుంపుల మధ్య, రద్దీగా ఉన్న వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. పరీక్ష సమయానికి ఆలస్యమవుతుందనే భయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ప్రభుత్వ స్కూల్స్‌కు సెలవు
చంద్రబాబు సభతో నర్సీపట్నంలో ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అయితే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం సాధారణంగా కొనసాగాయి. దీంతో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు బస్సుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.


