శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో | Youth Sparks Outrage After Using Temple Lamp To Light Cigarette In Kurnool, More Details Inside | Sakshi
Sakshi News home page

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

Jul 7 2026 12:46 PM | Updated on Jul 7 2026 1:57 PM

Sri Muneeshwara Shiva Temple Incident On Kurnool District

రీల్స్‌ కోసం దేవుడి దీపంతో సిగరెట్‌ వెలిగించిన యువకుడు

కర్నూల్‌, ఆదోని అర్బన్‌: భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కొందరికి పరిపాటిగా మారింది. రీల్స్‌ కోసం ఓ యువకుడు  దేవుడికి వెలిగించిన దీపంతో సిగరెట్‌ వెలిగించుకున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఆదోని పట్టణంలోని రణమండల కొండ మార్గమధ్యలో శ్రీ మునీశ్వర శివాలయంలో గుర్తు తెలియని యువకుడు నోట్లో సిగరెట్‌ పెట్టుకుని నేరుగా శివుడి ముందు వెలిగించిన దీపంతో వెలిగించుకున్నాడు. అనంతరం తలపైకి ఎత్తి పొగను వదిలి స్వామివారికి నమస్కరించి నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లి మళ్లీ నందికి నమస్కరించి నవ్వుతూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను మరొకరు సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement