పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు! | Sakshi editor Dhananjaya Reddy faces a series of illegal cases | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు!

Sep 3 2025 4:30 AM | Updated on Sep 3 2025 4:30 AM

Sakshi editor Dhananjaya Reddy faces a series of illegal cases

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘సాక్షి’పై ఆది నుంచీ చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు 

‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు.. రాజ్యాంగం కల్పించిన 

భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్న కూటమి సర్కార్‌ 

ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తోన్న రాష్ట్ర పరిస్థితి సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమల్లో ఘోర వైఫల్యం.. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఆది నుంచీ చంద్రబాబు కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తున్న ‘సాక్షి’పై పోలీసులను ఉసిగొలిపి, అక్రమ కేసులు బనాయిస్తూ బరితెగిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను యథేచ్ఛగా కాలరాస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తూ.. ఎమర్జెన్సీ నాటి దురాగతాలను గుర్తుచేస్తోంది. 

సోమవారం ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు తార్కాణం. దీనిని అడ్డుపెట్టుకుని సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు దాడికి తెగబడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2 గంటల వరకూ హల్‌చల్‌ చేస్తూ భయోత్పాతం సృష్టించారు. ఇంతకూ ఆ అక్రమ కేసు ఎందుకు బనాయించారంటే.. పోలీసు అధికారుల హక్కులపై ‘సాక్షి’ గళమెత్తినందుకే. 

బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనం.. 
రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్‌ కాల పరిమితి ఆగస్టు 31తో ముగిసింది. కానీ.. పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు. మళ్లీ కొత్తగా ప్యానల్‌ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించే సరికి మరికొందరు రిటైరవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదనే నెపంతోనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు. 

పోలీసు శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ.. ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడికి తెగబడింది. ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే సాక్షి గళమెత్తిందో.. అదే పోలీసు అధికారులతోనే అక్రమ కేసు నమోదు చేయించి అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. 

ఆ ఫిర్యాదు కూడా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌తో చేయించి మరీ అక్రమ కేసు పెట్టడం గమనార్హం. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్‌లో ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 61(2), 196(1), 353(2) కింద కేసు(క్రైమ్‌ నంబరు 543/ 2025) నమోదు చేశారు. 

ఆది నుంచీ అక్రమ కేసులే.. 
చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడి చేస్తోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. కూటమి అరాచకాలను ఎక్కడికక్కడ ప్రశి్నస్తుండడంతో గొంతు నొక్కే దుస్సాహసానికి ఒడిగడుతోంది. రాజ్యాంగం కల్పించిన ఆరి్టకల్‌–19 (1)(ఏ)లోని భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. అక్రమ కేసులు బనాయించడాన్ని న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. 

భావ ప్రకటనపై వచ్చే ఫిర్యాదుల కేసు నమోదు విషయాల్లో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసుశాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా సరే.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎత్తిచూపుతున్న ‘సాక్షి’ని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. 
బాపట్ల టౌన్, టెక్కలి, కోనేరుసెంటర్, నరసరావుపేట: సాక్షి ఎడిటర్, మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం బాపట్ల జర్నలిస్ట్‌ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ పోలీసులకు వినతిపత్రం 
అందజేశారు. 
» సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ బందరు డీఎస్పీ చప్పిడి రాజాకు మచిలీపట్నం ‘సాక్షి’ పాత్రికేయుల బృందం మంగళవారం రాత్రి వినతిపత్రం అందజేసింది.  
»  సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసుపై పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పాత్రికేయులు నిరసించారు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్, నరసరావుపేట, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఏపీడబ్ల్యూయు జే) ప్రతినిధులు ఇన్‌చార్జి డీఎస్పీ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.  

అక్రమ కేసు వెనక్కి తీసుకోవాలి 
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ దిన పత్రికపై ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టడం తగదు. జర్నలిస్టు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించాలి.  – శాసపు జోగినాయుడు, ఏపీ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు 

అర్ధరాత్రి చొరబాటు దారుణం 
రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ మీడియా సంస్థపై దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. అర్ధరాత్రి పత్రికా కార్యాలయంలోకి చొరబడటం అసమంజసం, అనైతికం.  – స్వాతిప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ 

యూపీ బాటలో ఏపీ 
ఏపీలో ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదు. ఆరి్టకల్‌ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. సాక్షి కార్యాలయాల్లోకి చొరబడి జర్నలిస్టులను విచారించడం అనైతికం.  – నల్లి ధర్మారావు, స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు

పత్రికా స్వేచ్ఛపై దాడి.. 
పత్రికా ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నట్లే. భావ వ్యక్తీకరణను అడ్డుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టొద్దని కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా లెక్క చేయడం లేదు.  – బి.మురళీకృష్ణ, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ సభ్యులు 

మీడియా స్వేచ్ఛను హరించడమే.. 
కూటమి సర్కారు మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. అర్ధరాత్రి ‘సాక్షి’ కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగడం సమంజసం కాదు.  అధికారంలో ఉన్న వారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా? ఏదైనా సమస్య ఉంటే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాండర్‌ ఇవ్వాలి.   – మచ్చా రామలింగా రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ 

పత్రికలను ఇబ్బంది పెట్టే సంప్రదాయం మంచిది కాదు 
ప్రజల పక్షాన గళమెత్తుతున్న ‘సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి. పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.  – కొత్తపల్లి అనిల్‌కుమార్‌ రెడ్డి, ఏపీ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఇప్పటి వరకు ‘సాక్షి’పై అక్రమంగా నమోదు చేసిన కేసులివీ..
» గత ఏడాది ఆగస్టు 31న విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీ సినందుకు ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు 
» పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 9న అక్రమ కేసు 
» కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్‌ కుటుంబం కిడ్నాప్‌ ఉదంతాన్ని వెలుగులోకి తెచి్చనందుకు.. అదే జిల్లాలో ఓ ఐపీఎస్‌ అరాచకాలను ఎండగట్టినందుకు ‘‘సాక్షి’’ పత్రికపై అక్రమ కేసులు నమోదు  
» అనంతపురంలో బాలికపై టీడీపీ మూకలు అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశి్నంచినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు 
»  ఇటీవల భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై అక్రమ కేసు 
» శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు  
» వాట్సప్‌ గవర్నెన్స్‌ ముసుగులో చేస్తున్న సంక్షేమ పథకాల ఎగవేత, ఓట్ల తొలగింపుపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై న్యాయస్థానంలో ఫిర్యాదుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అనుమతి ఇస్తూ మార్చి 5న ఉత్తర్వులు జారీ 
» మే 8న పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్‌చల్‌ (ఓ పత్రిక ఎడిటర్‌ నివాసంలో తనిఖీల పేరుతో వేధింపులకు దిగడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి) 
»  ‘సాక్షి’ టీవీ డిబేట్‌లో సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలను అన్నట్లుగా జూన్‌ 9న అక్రమ కేసు, అరెస్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement