‘సీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు’ | Sake Sailajanath Slams Chandrababu Naidu On His Negligence On Rayalasima Lift Irrigation | Sakshi
Sakshi News home page

‘సీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు’

Mar 31 2026 3:03 PM | Updated on Mar 31 2026 3:29 PM

Sake Sailajanath Slams Chandrababu Naidu On His Negligence On Rayalasima Lift Irrigation

సాక్షి,అన్నమయ్య: భవిష్యత్‌లో రాయలసీమకు సాగునీరు,తాగునీరు తీవ్ర ఇబ్బందులు రాబోతున్నాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి నీళ్లు రావడమే కష్టంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లో 1996 ఆలమట్టి రిజర్వాయర్‌గా   ప్రారంభమై 200 టీఎంసీ వరద నీరు నిల్వ స్థాయికి చేరింది.

అప్పర్ భద్ర, తుంగ భద్ర నీళ్ళు 30 టీఎంసీ నిల్వ చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులది. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు తీసుకుని వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేస్తూ, శిష్యుడుకు తాకట్టు పెట్టాడు.

90 శాతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయి.840 అడుగులు దగ్గర పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నది నుండి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పూర్తి చేయాలి.రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.

వైఎస్సార్‌సీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది.పోలవరం ఎడమ పనులు పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు ఆన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.15 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అమరావతిలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టులో  కాలువలు ఎత్తు తగ్గించాడు.రాయలసీమ నుంచి కర్నూలు హైకోర్టు తీసుకుపోయారు, ఎయిమ్స్ ను తరలించుకుపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను వెంటనే పూర్తి చేయాలి’అని డిమాండ్‌ చేశారు.  

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement