'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ'

Sajjala Ramakrishna Reddy slams Chandrababu Naidu in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: ప్రజలు ఇదేం ఖర్మ అని భావించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఏపీలో 90శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. మంచి పాలనకు నిదర్శనం సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. 

'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు చంద్రబాబే ఉదాహరణ. ఎల్లోమీడియా ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో పెద్ద ఎత్తున కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా విస్తరించారు. వ్యాధులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ సర్కారు కృషి చేస్తోంది' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

చదవండి: (తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top