లడ్డూ వివాదం.. చంద్రబాబుకు భయం పట్టుకుంది.. అందుకే సిట్‌ : సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Naidu Over Tirupati Laddu Row, More Details Inside | Sakshi
Sakshi News home page

లడ్డూ వివాదం.. చంద్రబాబుకు భయం పట్టుకుంది.. అందుకే సిట్‌ : సజ్జల

Sep 29 2024 3:08 PM | Updated on Sep 29 2024 7:29 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Over Tirupati Laddu Row

సాక్షి,అమరావతి : తిరుమల లడ్డు వివాదంపై వైఎస్సార్‌సీపీ కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్‌ వేశారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

లడ్డూపై తాను తప్పుడు ఆరోపణలు చేయలేదని అనుకుంటే సుప్రీం కోర్టు విచారణను కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్‌ వేయాల్సిందన్నారు. ఆధారాలు, ధైర్యం లేదు కాబట్టే సిట్‌ విచారణ అని అంటున్నారు. ముందుగా విచారణ చేపట్టామని చెప్పుకునేందుకే సిట్‌ వేశారు.

లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు బయపడ్డారు. లడ్డూపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని సజ్జల రామకృష్ణారెడ్డి తలిపారు. 

👉 చదవండి :  ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement