
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మహిళతో సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మూలస్థానం జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ఒక మహిళతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలోనే మరో కారు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది.