AP: రాష్ట్రానికి రెండు వందేభారత్‌ రైళ్లు.. ఆ రెండు మార్గాల్లోనే!

Railway Department Allocated Two Vande Bharat Express trains to AP - Sakshi

సాక్షి, అమరావతి: రైల్వే శాఖ రాష్ట్రానికి రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి వర్తమానం అందింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్‌ ఎక్స్‌­ప్రెస్‌ను 2023 జనవరిలో సికింద్రాబాద్‌–­విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించారు. త్వరలోనే అధికారికంగా తేదీని ఖరారు చేస్తారు.

గంటకు 165 కి.మీ. వేగంతో ప్రయా­ణిం­చడంతోపాటు 1,129 సీటింగ్‌ సామ­ర్థ్యం కలిగిన ఈ రైలును మొదట సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు నడుపుతారు. తరువాత విశాఖపట్నం వరకు పొడి­గి­స్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండో వందే­భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య నడపనున్నారు. ఈ రైలును సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు నడపాలని దక్షిణ మధ్య రైల్వేవర్గాలు భావిస్తు­న్నా­యి. ఈ రైలు రూట్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

చదవండి: (దేశంలో క్రీడలకు ప్రోత్సాహం తగినంతగా లేదు.. ఎంపీ మార్గాని భరత్ ఆవేదన)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top