
సాక్షి, నిడదవోలు: అమరావతి పాదయాత్రకు తూర్పుగోదావరిలోని నిడదవోలులో నిరసన సెగ తగిలింది. కాగా, నిడదవోలులో పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. టీడీపీ బినామీలు గో బ్యాక్ అంటూ ప్రజా సంఘాల నిరసన తెలిపాయి. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. మూడు రాజధానులకే మా మద్దతు అంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు.