సాక్షి, కర్నూలు: జిల్లాలోని గొందిపర్లలో ఉగ్రవాది నూర్ మహమ్మద్‌ని పోలీసులు ఈ రోజు( మంగళవారం) అరెస్టు చేశారు. ఇతను గత మూడు నెలలుగా తీవ్రవాదులతో మాట్లాడుతున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. నూర్ మహమ్మద్ వివరాలు ఆరా తీసిన పోలీసులు ఇతను సికింద్రాబాద్‌లోని జిమ్మిగూడకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. దీంతో నూర్ మహమ్మద్‌ని కస్టడీకి తీసుకొని విజయవాడకు తరలించారు.


