PM-SYM Scheme: ఏపీలో 1.51 లక్షల మంది నమోదు

People Registered For PMSYM Scheme In AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ (పీఎం–ఎస్‌వైఎం) పెన్షన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,51,882 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిస్తూ.. అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో భద్రత కల్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం కింద 60 ఏళ్లు పైబడిన కార్మికులకు ప్రభుత్వం నెలకు మూడువేల రూపాయలు పెన్షన్‌గా చెల్లిస్తుందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఈ పథకం ప్రయోజనాలను విçస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. దేశంలో 18–40 ఏళ్ల మధ్య ఉన్న 5.24 కోట్ల ఈ–శ్రమ కార్డు కలిగినవారందరినీ ఈ పథకంలో నమోదు చేసుకోవాలని ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top