ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకం: పాల్‌రాజ్‌

Paulraj Says AB Venkateswara Rao Not Given Investigation Details To Authorities - Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను డీఐజీ పాల్‌రాజ్ వెల్లడించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబీ వెంకటేశ్వరావునే పర్యవేక్షించారని తెలిపారు. దర్యాప్తు వివరాలు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో ఏబీవీనే చెప్పాలని అన్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికితీయకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై బురద జల్లే యత్నం చేశారని తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏబీవీ సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తెలిపారు. ఏబీవీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐకి సీల్డ్‌కవర్‌లో లేఖ పంపొచ్చని చెప్పారు.

ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్‌ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకమని గుర్తుచేశారు. ఏబీవీకి అనుమానాలుంటే పద్ధతి ప్రకారం సమాచారం ఇవ్వాలని డీఐజీ పాల్‌రాజ్‌ అన్నారు.
చదవండి: 
కరోనా బారిన పడి డీఎస్పీ మృతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top