Passenger Dies of Heart Attack on Air India Flight from Sharjah to Vijayawada - Sakshi
Sakshi News home page

గుండెపోటుతో విమానంలో ప్రయాణికుడు మృతి

May 23 2023 7:58 AM | Updated on May 23 2023 11:09 AM

Passenger Died With Heart Attak On The Plane - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గన్నవరం: షార్జా నుంచి విజయవాడ వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. విమానాశ్రయ వర్గాల సమాచారం మేరకు... ఏలూరు జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజు(85) కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి షార్జా నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు బయలు దేరారు.

విమానం మరో అరగంటలో ఎయిర్‌పోర్టుకు చేరనుందనగా నూకరాజుకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. విమానంలోని సిబ్బంది ఆయనకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైలెట్ల సమాచారం మేరకు విమానం ల్యాండ్‌ అయిన వెంటనే నూకరాజును ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. విమానాశ్రయంలో నూకరాజును పరీక్షించిన అంబులెన్స్‌ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం నిడదవోలుకు తీసుకువెళ్లారు. ఈ విమానంలో మృతుడి కుమారుడు, భార్యతో పాటు మరో ఏడుగురు బంధువులు ఉన్నారు.

(చదవండి: YSRCP: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement