Andhra Pradesh: రెండు జిల్లాలకు ఒక డీఐజీ

One DIG For Two Districts In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: జిల్లాల పునర్వ్యవస్థీకరణతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రెండు జిల్లాలకు కలిపి ఒక డీఐజీని నియమించారు. పునర్వ్యవస్థీకరణకు ముందు 13 జిల్లాలకు 13 మంది డీఐజీలు ఉండేవారు. గతంలో ఒక జిల్లా బాధ్యతలు చూసిన డీఐజీలు ఇప్పుడు రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టులను మాత్రం 26 జిల్లాలకు సర్దుబాటు చేశారు. వాస్తవానికి జిల్లాల విభజనకు చాలాకాలం ముందు నుంచే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా రిజిస్ట్రార్‌ను (డీఆర్‌) నియమించారు. కొత్త జిల్లా కేంద్రాల ప్రకారం ఇప్పుడు వారిని సర్దుబాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రకాశం జిల్లా మార్కాపురం డీఆర్‌ను నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్‌గా గూడూరు డీఆర్‌ను, బాపట్ల డీఆర్‌గా తెనాలి డీఆర్‌ను, ప్రొద్దుటూరు డీఆర్‌ను అన్నమయ్య జిల్లా డీఆర్‌గా, హిందూపురం డీఆర్‌ను సత్యసాయి జిల్లా డీఆర్‌గా నియమించారు. మిగిలిన పాత జిల్లా కేంద్రాలు, రిజిస్ట్రేషన్‌ జిల్లాల కేంద్రాల్లో అక్కడి వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top