Omicron Variant: హోం క్వారంటైన్‌లోనే...ఒమిక్రాన్‌ తగ్గింది

Omicron Positive Patients Recovery With Home Quarantine In Vizianagaram - Sakshi

సాక్షి, అమరావతి/ విజయ నగరం టౌన్‌/ ఎస్‌.కోట రూరల్‌: విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ బారిన పడ్డ వ్యక్తి హోం క్వారంటైన్‌లోనే వైరస్‌ను జయించాడని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవన్నారు. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు అతడి నమూనాలు పంపామన్నారు.

ఈ ఫలితం శనివారం రాత్రి అందిందని చెప్పారు. అయితే హోమ్‌ క్వారంటైన్‌ అనంతరం శనివారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో అతడికి నెగెటివ్‌గా తేలిందన్నారు. అతడితో కాంటాక్ట్‌ అయిన 40 మందికి కూడా పరీక్షలు చేశామని.. అందరికీ నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి రాగా వీరిలో 12,900 మందిని గుర్తించామన్నారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వీరి నమూనాలను కూడా హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపామన్నారు. 10 మంది ఫలితాలు వెలువడగా కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. 

ఫేక్‌ వార్తలు నమ్మొద్దు..

డాక్టర్‌ హైమావతి

తిరుపతిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా తేలిందని జరుగుతున్న ప్రచారాన్ని హైమావతి తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం.. ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్‌ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్‌లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఒమిక్రాన్‌ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. 

ఒమిక్రాన్‌ తగ్గింది 
ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్‌ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్‌లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఒమిక్రాన్‌ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top