అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు: ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh Slams CBN Over Elections Alliance - Sakshi

సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వాల హయాంలో అగ్రవర్ణాలకు మాత్రమే‌ పదవులు దక్కేవని.. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అన్నారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌. ఒక పక్క పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే..  పేదలకు డబ్బులిస్తే సోంబేరుల్లా‌ మారుతారని వ్యాఖ్యానించడం వాళ్ల(ప్రతిపక్ష నేతల) ఆలోచనా ధోరణికి నిదర్శనమని అన్నారాయన. అలసిపోయిన వర్గాలకు బాసటగా ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేశారని, కానీ, ప్రతిపక్షానికి అది సహించడం లేదని ఎంపీ నందిగం సురేష్‌ వ్యాఖ్యానించారు. 

ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. ఇంటింటికి తిరిగి.. ‘రండి.. కలసి రండి’ అని అడుక్కుంటున్నాడు. సింగిల్‌గా వచ్చే దమ్ము ఆయనకు లేదని స్పష్టం అవుతోంది. అందుకే ‘దత్తపుత్రుడి’తో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. కానీ, ఎంత మంది వచ్చినా వైఎస్‌ జగన్‌ను కదిలించలేరని వ్యాఖ్యానించారు. 

గతంలో రెండుసార్లు వైఎస్‌ జగన్.. ఎలాంటి పొత్తు లేకుండా 2014, 2019 ఎలక్షన్స్‌లో పోటీచేశారని, తెలుగు దేశంలాగా పొత్తుల కోసం వెంపర్లాడలేదని అన్నారు. ఇక టీడీపీ సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోందని. అత్యాచారాలు,‌మహిళలపై  దాడుల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించాలని చూస్తోందని పేర్కొన్నారు. కానీ, గత‌ ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అంతా సంతోషంగా ఉన్నారు. కాబట్టి, ప్రజా క్షేమం కోసం మళ్లీ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను, ముఖ్యనేతలను ఉద్దేశించి ఎంపీ నందిగం సురేష్‌ వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top