సీఎం జగన్‌ తరహాలోనే నిరుద్యోగులకు మోదీ ఉపాధి కల్పించాలి: రామకృష్ణ | Modi Should Provide Employment to Unemployed like CM Jagan: Ramakrishna | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ తరహాలోనే నిరుద్యోగులకు మోదీ ఉపాధి కల్పించాలి: రామకృష్ణ

Jun 18 2022 8:02 AM | Updated on Jun 18 2022 2:34 PM

Modi Should Provide Employment to Unemployed like CM Jagan: Ramakrishna - Sakshi

సాక్షి, అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో సీఎం జగన్‌ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లుగానే.. మోదీ ప్రభుత్వం ఉపాధి కల్పించాలని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ సూచించారు. స్థానిక నెహ్రూచౌక్‌లో జిల్లా సీపీఐ మొదటి మహాసభలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

బీజేపీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి యువతను నట్టేట ముంచిందన్నారు. కేంద్రంలో సైనికుల దళాన్ని నిర్వీర్యం చేసేందుకు ‘అగ్నిపథ్‌’ పేరుతో పన్నాగాలు పన్నడంతో యువత కేంద్రంపై విరుచుకుపడుతోందన్నారు. 

చదవండి: (‘గడప గడప’పై పచ్చటి విషం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement