నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. అధికారిక ప్రకటన

MLC Elections Cross Vote YSRCP Announced Four MLAs Suspension - Sakshi

సాక్షి, అమరావతి:  ఎమ్మెల్యే  కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారాయన. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని చెప్పారు సజ్జల.

క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నాం.  చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారు. మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది.    ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్‌ చేశారు. క్రాస్‌ ఓటింగ్‌ చేసినవాళ్లకు టికెట్‌ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు  అని సజ్జల మీడియాకు వివరించారు.

ఇదీ చదవండి: సీఎం జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top