ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌ | MLA Bhumana Karunakar Reddy tests positive for COVID-19 | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

Aug 26 2020 9:44 AM | Updated on Aug 26 2020 11:50 AM

MLA Bhumana Karunakar Reddy tests positive for COVID-19 - Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. (కరోనా: ఆదర్శంగా నిలిచిన భూమన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement