తప్పిపోయిన పిల్లి దొరికింది

Missing Pet Cat In East Godavari - Sakshi

తూర్పు గోదావరి: తమ బిడ్డలో పెద్దలో తప్పిపోతే వారి గురించి వెతకడం అందరికీ తెలిసిందే. అలాగే కుక్కలు, ఆవులు, గేదెల వంటివి తప్పిపోయినా వాటి కోసం యజమానులు గాలిస్తారు. ఇదే కోవలో ఓ పెంపుడు పిల్లి తప్పిపోవడం.. దాని యజమానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ వివరాలివీ.. మలికిపురానికి చెందిన వ్యాపారి జాన భగవాన్‌ పెంపుడు పిల్లి శుక్రవారం తప్పిపోయింది. పర్షియన్‌ జాతికి చెందిన ఈ పిల్లిని ఆయన హైదరాబాద్‌లో రూ.50 వేలకు కొనుగోలు చేసి పెంచుతున్నారు.

శుక్రవారం ఇంటి తలుపులు తీసి ఉండడంతో అది బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో ఆయన తన పెంపుడు పిల్లి తప్పిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. గ్రామానికి చెందిన కొంతమంది అది చూసి.. ఆ పిల్లిని కుక్కలు దాడి చేస్తుండగా రక్షించామని.. ఎవరిదో తెలియక రాజమహేంద్రవరం పంపే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. దీంతో వారి వద్దకు భగవాన్‌ శనివారం వెళ్లి తన పిల్లిని తెచ్చుకున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top