అరుదైన వ్యాధికి అద్భుత చికిత్స  | Sakshi
Sakshi News home page

అరుదైన వ్యాధికి అద్భుత చికిత్స 

Published Sun, Aug 27 2023 3:38 AM

A miracle cure for a rare disease - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): అరుదైన గిలియన్‌ బ్యారీ సిండ్రోమ్‌(జీబీ సిండ్రోమ్‌) వ్యాధి సోకిన 12 ఏళ్ల బాలుడికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహె­చ్‌) వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఖరీదైన వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందించి బాలుడికి స్వస్థత చేకూర్చడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్‌ కథనం మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు కొత్తపేటకు చెందిన నాగభూషణం, మౌనిక దంపతు­లు రోడ్డు పక్కన టిఫిన్‌ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి 12 ఏళ్ల కుమారుడు సాయిలోకేశ్‌ స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతు­న్నా­డు. ఈ నెల ఆరో తేదీన జ్వరం, విరేచనాలు, ఆ త­ర్వా­త కాళ్లు చచ్చుబడి పోవడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే ఇది అరు­దై­న వ్యాధి అని, చికిత్సకు రూ.8 లక్షలు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. అంత ఖర్చుచేసి వైద్యం చేయించే స్థోమత లేక వారు ఇంటికి వెళ్లిపోయా­Æ­ý‡ు. ఇదిలా ఉండగా విజయవాడ ప్రభు­త్వాస్పత్రిలో మంచి వైద్యం అందుతుందని తెలుసుకుని ఈ నెల 9న పాత ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో సాయిలోకేశ్‌ను చేర్చారు. అక్కడి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.సునీత బాలుడిని పరీక్షించి వెంటనే ఇమ్యునోగ్లోబలిన్‌ ఇంజక్షన్ల కోసం ఇండెంట్‌ పెట్టి తెప్పించారు.

ఒక్కో ఇంజక్షన్‌ ఖరీదు రూ.18 వేల వరకూ ఉంది. బాలుడికి 20 ఇంజక్షన్స్‌ ఇచ్చారు. అంటే దాదాపు రూ.3.60 లక్షల ఖరీదైన ఇంజక్షన్లు చేశారన్నమాట. దీంతో క్రమేపీ నరాల పట్టు రావడంతో పాటు, మూడు రోజులకు బాలుడు నడవడం ప్రారంభించాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కాగా, ప్రభుత్వా­స్పత్రిలో ఇంత బాగా చూస్తారని అనుకో­లేదని బాలు­డి తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Advertisement
Advertisement