ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే

Minister Venugopala Krishna Press Meet On AP Cabinet Decisions - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.

ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్‌ చర్చించింది. వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.

కర్నూలు జిల్లా డోన్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం
ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం
ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం
1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
విశాఖలో టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం
రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్‌ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం
లీగల సెల్‌ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
పంప్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top