ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మంత్రి విశ్వరూప్

సాక్షి, అమలాపురం టౌన్: ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ను ఐసీయూ నుంచి సాధారణ వైద్యానికి స్పెషల్ రూమ్‌కు గురువారం సాయంత్రం మార్చారు. ఈ విషయాన్ని ముంబై నుంచి మంత్రి కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.