‘ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలే’

విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారని బొత్స కొనియాడారు. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల సంస్థ ఆవిర్భావ సభలో బొత్స మాట్లాడారు.
‘ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలే. గ్రామ సచిలాలయ ఉద్యోగులు నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పనులు జరుగుతున్నాయి. నీతి ఆయోగ్ బృందం సచివాలయ వ్యవస్థను అభినందించింది. ఆర్బీఐ కేంద్రాలను దేశమంతటా ఏర్పాటు చేయాలని కేంద్రం చూస్తోంది. సచివాలయ ఉద్యోగులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని బొత్స పేర్కొన్నారు
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘గ్రామ సచివాలయ ఉద్యోగుల భవిష్యత్‌కు రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నాం. గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలు అభినందనీయం’ అని పేర్కొన్నారు.