మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్తా!

Medical Student Chaitanya says He Would Go Back To Ukraine Study End Of Ukraine Crisis - Sakshi

చిత్తూరు (బి.కొత్తకోట) : ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఆగిపోయాక చదువుకునేందుకు మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్తానని వైద్య విద్యార్థి చైతన్య అన్నాడు. స్థానిక శెట్టిపల్లెరోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కుమారుడు ఎస్‌.చైతన్య ఫిబ్రవరి 13న ఉక్రెయిన్‌ వెళ్లాడు. ఇవానో ఫ్రాక్విస్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్య తొలి ఏడాది తరగతులకు హాజరయ్యేందుకు వెళ్లగా యుద్ధం కారణంగా రెండు వారాలకు శనివారం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇవానోలోని అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో తోటి విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. గత శనివారం ఇవానో నుంచి బస్సులో రుమేనియా సరిహద్దుకు వెళ్లి, అక్కడి రాజధాని బుకారెస్ట్‌లోగడిపాక విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి బి.కొత్తకోటకు చేరుకున్నాడు.

చైతన్య మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదివేందుకు తల్లిదండ్రులు రూ.9లక్షలకు పైగా ఫీజులు చెల్లించి పంపారు. వెళ్లిన పదిరోజులకే రష్యా సైనిక చర్య చేపట్టడం ఆందోళన కలిగించింది. ఇక్కడి మిత్రులతో కలిసి బయటపడేందుకు ప్రయత్నించి రొమెనియా చేరుకున్నాం. అమ్మానాన్న కూడా సురక్షితంగా ఇంటికి వచ్చేయమంటూ కోరారు. తానుంటున్న ఫ్లాం్లట్‌కు సమీపంలోనే బాంబులు పడ్డాయి. భయంతో వణికిపోయాం. తమ బాధను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకున్నారు. వారందించిన సహకారానికి రుణపడి ఉంటాం. యుద్ధం ఆగిపోయాక మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్లి వైద్యవిద్య చదువుకుంటా.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top