విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్‌ ఎక్కడ? | Sakshi
Sakshi News home page

విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్‌ ఎక్కడ?

Published Mon, Nov 20 2023 6:57 AM

Massive Fire Accident In Visakhapatnam Fishing Harbour - Sakshi

Updates..

►విశాఖపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని  వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

►సీఎం జగన్‌ ఆదేశాలతో ఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి సీదిరి అప్పలరాజు. 

►విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్‌ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్‌. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

►విశాఖపట్నంంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 30కి పైగా బోట్లు కాలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

►ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్లు ద్వారా అదుపులోకి తెచ్చారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

►మరోవైపు.. విశాఖ ఫిషింగ్  హార్బర్‌లో  అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో వివరాలను పోలీసు కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement