పాసింజర్‌ టు ఎక్స్‌ప్రెస్‌!

Many Passenger Trains To Be Converted Into Express In AP - Sakshi

సాక్షి, అమరావతి:ఇన్నాళ్లూ పాసింజర్లుగా నడుస్తున్న పలు రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు డివిజన్లలో దాదాపు 20 వరకు పాసింజర్లు ఇలా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా  అప్‌గ్రేడ్‌ కానున్నాయి.  

  • దేశంలోని వివిధ జోన్ల పరిధిలో నడుస్తున్న పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌/మెయిల్‌లుగా మార్పు చేస్తూ తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాటి      వివరాలను వెల్లడించింది.  
  • పాసింజర్‌ రైళ్లు గమ్యాన్ని చేరడంలో ఆలస్యమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయాల్సిన పాసింజర్‌ రైళ్ల వివరాలను ఆయా రైల్వే జోనల్‌ కార్యాలయాల నుంచి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు/సిఫార్సులు వెళ్లాయి.  
  • వాటిని అనుసరించి పలు పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు చేసింది.  

అమలు ఎప్పటినుంచంటే.. 
అయితే ఈ రైళ్లు ఎప్పట్నుంచి ఎక్స్‌ప్రెస్‌లుగా రూపాంతరం చెందుతాయన్నది రైల్వే బోర్డు ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యంలో కొన్ని స్పెషల్‌ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. తిరిగి పూర్తి స్థాయిలో రెగ్యులర్‌ రైళ్లను నడపడం ప్రారంభించాక అప్‌గ్రేడ్‌ చేసిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా నడపుతారని తెలుస్తోంది.  

వేగంగా గమ్యానికి.. 
ఇవి ఎక్స్‌ప్రెస్‌లుగా మారితే ప్రయాణ వేగం మరింతగా పెరగనుంది. దీంతో గమ్యానికి చేరుకునే సమయం బాగా తగ్గుతుంది. ప్రయాణం కలిసొస్తుంది. కాగా ప్రస్తుతం ఆగుతున్న పాసింజర్‌ హాల్టుల్లో ఇకపై ఈ ఎక్స్‌ప్రెస్‌లు ఆగవన్నమాట! అయితే కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన రైళ్లకు పాసింజర్‌ హాల్టులున్న కొన్ని ముఖ్య స్టేషన్లలో హాల్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌ప్రెస్‌లుగా మారగా మిగిలిన పాసింజర్‌ రైళ్లు మాత్రం నిర్ణీత స్టేషన్లలో యథావిధిగా ఆగుతాయి. కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారాక ఈ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, మరికొన్ని రైళ్లలో థర్డ్‌ ఏసీ కోచ్‌లను కూడా ఏర్పాటుతో పాటు రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉండే వీలుంది. 

ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్న పాసింజర్‌ రైళ్లు ఇవే.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top