పల్లెలకు కొత్తరూపు.. 'దారులన్నీ ప్రగతి వైపు'

Many changes in Visakhapatnam district during the year in AP - Sakshi

విశాఖ జిల్లాలో ఏడాదిన్నరలో ఎన్నో మార్పులు

గ్రామ సచివాలయాలతో చేరువైన ప్రభుత్వ సేవలు

రైతుభరోసా కేంద్రాలతో రైతన్నలకు అండదండలు

గ్రామాల్లో కార్యాలయాలకు కొత్త భవనాలు

నాడు–నేడుతో మారిన ప్రభుత్వ పాఠశాలలు

సాక్షి, విశాఖపట్నం: పల్లె ప్రజలకు స్వర్ణయుగం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు చేరుతోంది. అందుకు గ్రామ సచివాలయాలు తోడ్పాటు అందిస్తున్నాయి. వాటితో పాటు రైతుభరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలు స్తున్నాయి. ప్రాథమిక వైద్యం సకాలంలో చెంతనే అందించేందుకు వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు కూడా రాబోతున్నాయి. వీటన్నింటికీ శాశ్వత భవనాలను అన్ని హంగులతో ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. బాలబాలికలు ప్రతి ఒక్కరూ బడిబాట పడుతున్నారు.     

మత్స్యకారుల జీవనోపాధికి భరోసా
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడి మడక వద్ద రూ.353.10 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మా ణానికి ప్రభుత్వం సం కల్పిం చింది. సము ద్రంలో చేపలవేట ఆధారంగా జీవిస్తున్న 20,273 మత్స్యకార కుటుం బాలకు వేట నిషేధకాలంలో రూ.10 వేల చొప్పున రూ.20.27 కోట్లు అంద జేసింది. ఫిషింగ్‌ బోట్లకు డీజి ల్‌పై లీటరుకు రూ.9 చొప్పున రూ.5.83 కోట్ల రాయితీ ఇచ్చింది.

మహిళాలోకానికి పెద్దపీట
జిల్లాలో 4,16,007 మంది స్వయం సహాయక సంఘ (డ్వాక్రా) సభ్యులకు 2019 ఏప్రిల్‌ నాటికి రూ.1,184 కోట్ల బ్యాంకు అప్పు ఉండేది. దీన్లో తొలి విడతగా ప్రభుత్వం రూ.296 కోట్ల రుణ మాఫీ చేసింది. బ్యాంకు లింకేజీ ద్వారా 35,716 సంఘాలకు రూ.960.56 కోట్ల రుణాల సదుపా యం కల్పించింది. 21,019 మంది సభ్యులకు మహిళా బ్యాంకు ద్వారా రూ.106.16 కోట్లు విడుదల చేసింది. 2,333 మంది మహిళలకు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి రూ.17.50 కోట్లు విడుదల చేసింది.

1వ తేదీనే ఠంచనుగా పింఛను
అర్హత ఉంటే చాలు.. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే మంజూరు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలు పక్కాగా అమలవుతున్నాయి. ప్రతినెలా ఠంచనుగా 1వ తేదీనే 12 రకాల పింఛన్లను గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 70 వేల కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినవారికి రూ.537.16 కోట్లు చెల్లించారు. విశాఖ ఏజెన్సీలోని 51,683 మంది గిరిజన రైతులకు 86,473 ఎకరాల అటవీ భూములపై హక్కు కల్పిస్తూ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను ప్రభుత్వం అందజేసింది. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు వివిధ పథకాల కింద 623.18 కోట్లతో 256 రోడ్ల పనులు మంజూరు చేసింది. 

ఆరోగ్యానికి రక్ష.. పేదలందరికీ ఇళ్లు..
జిల్లాలో 11,24,884 కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులను ప్రభుత్వం అందజేసింది. కంటివెలుగు కార్యక్రమంలో 6,35,645 మంది విద్యార్థులకు, 32,222 మంది వృద్ధులకు కళ్లద్దాలను పంపిణీ చేసింది. మరో 6,256 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్‌ చేయించింది.  జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో 3,00,124 మందికి ప్రభుత్వం ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 5,364.38 ఎకరాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసింది. అక్కడే ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. వీఎంఆర్‌డీఏ పరిధిలోని 15 మండలాల్లో 52,050 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీ ఇచ్చేందుకు రూ.936.90 కోట్లు మంజూరయ్యాయి.

ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం
జిల్లాలో కొత్తగా అర్హులైన 2,23,897 కుటుంబాలకు బియ్యం కార్డులు మంజూరయ్యాయి. మొత్తం జిల్లాలో దాదాపు 13 లక్షల పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం ప్రతి నెలా వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడానికి ప్రభుత్వం 828 మినీ ట్రక్కులను ప్రారంభించింది.  

మారిన పాఠశాలల దశ, దిశ
మనబడి ‘నాడు–నేడు’ కింద తొలివిడత 1,149 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.307.04 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. 592 అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తోంది. అమ్మ ఒడి పథకంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న 6,30,386 మందికి సంబంధించి 4.10 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.615 కోట్ల సాయాన్ని ప్రభుత్వం జమచేసింది. 3,17,202 మంది విద్యార్థులకు రూ.42.82 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక అందించింది. 

ప్రతి గ్రామంలోను శాశ్వత భవనాలు
జిల్లాలో 728 గ్రామ సచివాలయాలకు రూ.261.42 కోట్లతో ప్రభుత్వం శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టింది. వాటిలో 293 భవనాల నిర్మాణం పూర్తయింది. రూ.157.30 కోట్లతో చేపట్టిన 702 రైతుభరోసా కేంద్ర భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు చెంతనే వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.85.36 కోట్లతో 558 కొత్త భవనాల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇవన్నీ మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలనేది లక్ష్యం.

రికార్డు స్థాయిలో దిగుబడికి కృషి
విశాఖ జిల్లా రైతులు గత ఖరీఫ్‌ సీజన్‌ వరిసాగులో సగటున హెక్టారుకు 3,416.25 కిలోల దిగుబడి సాధించి రికార్డు సృష్టించారు. ఇందుకు ప్రభుత్వం 622 రైతుభరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు వెన్నంటి నిలిచింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 3,78,715 మంది రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద అందించిన రూ.309.29 కోట్ల పెట్టుబడి సాయం కూడా ఉపయోగపడింది. 2019–20 ఖరీఫ్‌లో ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన 2,971 మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.2.12 కోట్లను త్వరితగతిన ప్రభుత్వం అందజేసింది. ఇటీవలే నివర్‌ తుపానుతో నష్టపోయిన 37,715 మంది రైతులకు నెల రోజుల్లోపే రూ.25.57 కోట్ల పరిహారం అందించడం ఒక రికార్డు. ఇక 43,080 వ్యవసాయ బోర్లకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top