ఏపీ సంక్షేమ పథకాలకు లండన్‌ ఎంపీ కితాబు  | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారు: లండన్‌ ఎంపీ కితాబు 

Published Sat, Nov 26 2022 8:20 AM

London MP Praises AP Government Welfare Schemes - Sakshi

సాక్షి, అనంతపురం: లండన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ బాబ్‌బ్లాక్‌మెన్‌ను అనంతపురం మేయర్‌ వసీం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచినా ఆయన చాలా నిరాడంబరంగా తనతో గంటపాటు ముచ్చటించారని మేయర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందించి వివరించానన్నారు.

సచివాలయ – వలంటీర్‌ వ్యవస్థ, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన కితాబునిచ్చారన్నారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారని ప్రశంసించారన్నారు. లండన్‌లోని కట్టడాలు, కొత్త ఆలోచనలను అనంతపురం నగరపాలక సంస్థలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్‌ తెలిపారు.   

చదవండి: (అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం)

Advertisement
 
Advertisement
 
Advertisement