‘కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం’ | Kurasala Kannababu Slams Chandrababu Over Fuel Shortage In Andhra Pradesh, Calls It Queue Government | Sakshi
Sakshi News home page

‘కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం’

Apr 28 2026 4:36 PM | Updated on Apr 28 2026 5:01 PM

kurasala kannababu slams chandrababu over fuel shortage

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని..క్యూలో నిలబెట్టే ప్రభుత్వం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో ఇంధన సంక్షోభంపై ఆయన మీడియాతో మాట్లాడారు.  

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు సినియరిటీ..విజనరీ ఎవరికి కావాలి?. పెట్రోల్‌ బంకుల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది.కూటమి సర్కార్‌కు పబ్లిసిటీ తప్ప.. ఏమీ చేతకాదు. స్టాక్ లేక బంకులు మూసివేశారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం. గ్యాస్,పెట్రోల్,డీజిల్, యూరియా కోసం ప్రజల్ని, రైతులను  క్యూలు కట్టిస్తున్నారు. వరి కోతలు..ఆక్వా కల్చర్‌కు డీజిల్‌ లేని దుస్ధితి.

కూటమీ ప్రభుత్వం ఫెల్యూర్ గవర్నమెంట్.. పబ్లిసిటీ తప్పా ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఐదు రోజుల నుండి సీఎం ఆగ్రహం అంటున్నారు. సీఎం ఆగ్రహనికి విలువలేదా? కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల్ని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎలా ఆదుకున్నారో గుర్తు తెచ్చుకోవాలని హితువు పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement