
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొవ్వొత్తులతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, సాక్షి మీడియా జర్నలిస్టులు, ఇతర మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.