నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా? | Jana Sena leader attacks Home Guard | Sakshi
Sakshi News home page

నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా?

Aug 26 2025 6:15 AM | Updated on Aug 26 2025 8:11 AM

Jana Sena leader attacks Home Guard

హోంగార్డుపై జనసేన నాయకుడు దాడి

అదేమని అడిగిన కానిస్టేబుల్‌పైనా చిందులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన

కోనేరుసెంటర్‌: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక జనసేన నేత రెచ్చిపోయాడు. నైట్‌ బీట్‌ డ్యూటీలో ఉన్న హోంగార్డును చావచితక్కొట్టాడు. అదేమని అడిగిన కానిస్టేబుల్‌ను దుర్భాషలాడా­డు. జనసేన నాయకుడి చేతిలో తీవ్రంగా గాయపడిన హోంగార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కానిస్టేబుల్‌ బాషా, హోంగార్డు మోహనరావు మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి విశ్వబ్రాహ్మణ కాలనీలోని బీట్‌ పాయింట్‌లో ఉన్న పుస్తకంలో సంతకం చేసేందుకు వెళ్ళా­రు. కానిస్టేబుల్‌ నోట్‌ బుక్‌ లో సంతకం పెడుతుండగా, మోహనరావు పక్కన ఉన్న బల్లపై కూర్చున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీ ఎనిమి­దో డివిజన్‌ ఇన్‌ఛార్జ్, జనసేన నాయకుడు కర్రి మహేష్‌ బైక్‌ వచ్చి అక్కడ ఆగాడు. ‘‘ఏంట్రా నన్ను చూసి కూడా నిలబడటంలేదంటూ’’ మో­­నరావును ఏక వచనంతో సంబో­ధిస్తూ తన అహంభావాన్ని ప్రద­ర్శించాడు.

‘‘నేను వ­చ్చా­క కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా’’ అంటూ ఆగ్రహంగా హోం­గార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయతి్నంచాడు. పక్క­నే ఉన్న కానిస్టేబుల్‌ బాషా... జనసేన నేత దుశ్చర్యను అడ్డుకొని పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయతి్నంచాడు. పూటుగా మద్యం సేవించి ఉన్న కర్రి మహేష్‌ కానిస్టేబుల్‌ను సైతం దుర్భాషలాడి పక్కకు తోసి, హోంగార్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన హోంగార్డును కర్రి మహేష్‌ బారి నుంచి తప్పించిన కానిస్టేబుల్, చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించాడు. కాగా, ఈ ఘటనపై మోహనరావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు మహే­ష్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలావుండగా, కర్రి మహేÙను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement