సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మికత,ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది.


శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వైఎస్ జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ‘అభినవ మేల్కోట భక్తి గీతమాలిక’ సీడీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిని సత్కరించారు. తరువాత వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయి. ఇలాంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి’ అని అన్నారు.

కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


