గిరి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ | International Marketing Target For Tribal Agricultural Forest Products | Sakshi
Sakshi News home page

గిరి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌

Jun 5 2022 11:22 AM | Updated on Jun 5 2022 11:22 AM

International Marketing Target For Tribal Agricultural Forest Products - Sakshi

సాక్షి, పాడేరు : గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ లక్ష్యంగా కృషిచేయాలని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ ఆదేశించారు. శనివారం సాయంత్రం పాడేరులోని వెలుగు కార్యాలయం సమీపంలోని వన్‌ధన్‌ యోజన మార్కెటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఐటీడీఏ పీవో పాడేరు డివిజన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులన్నింటిని పరిశీలించారు. వెలుగు కార్యాలయం సమీపంలో విశాలమైన స్థలం ఉందన్నారు.

అక్కడ మార్కెటింగ్‌ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా డుంబ్రిగుడ మండలంలోని డ్వాక్రా మహిళలు సత్తా సాధించారని, అదే స్ఫూర్తితో డివిజన్‌లోని అన్ని మండలాల డ్వాక్రా సంఘాలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. రోడ్డు పక్కనే ఉన్న సుండ్రుపుట్టు వెలుగు కార్యాలయం ద్వారా అన్ని అటవీ, వ్యవసాయ గిరిజన ఉత్పత్తులన్నింటికి రిటైల్‌ మార్కెటింగ్‌ జరపాలన్నారు. వన్‌ధన్‌ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలవుతున్న అన్ని వ్యాపార ఉత్పత్తులను రిటైల్‌గా అమ్మకాలు జరిపి ఆ లాభాలను డ్వాక్రా సంఘాలకు వర్తింపజేయాలన్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళి, డీపీఎం సత్యం నాయుడు, వెలుగు ఏపీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

(చదవండి:  పోలీసులకు చిక్కిన హుండీల దొంగ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement