
మార్చి 24 వరకు ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు
షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ విద్యా మండలి
ఈనెల 10 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్–2026 పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా షెడూŠయ్‌ల్ విడుదల చేశారు. మొదటి ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండియర్‌వి 24 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు ఉ.9 నుంచి మ.12 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు వొకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరుగుతాయి.
అలాగే, సమగ్ర శిక్ష ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న వొకేషనల్ ట్రేడ్స్‌కు ఫిబ్రవరి 13న ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులకు నైతిక విలువలు, మానవ విలువలు (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్)పై జనవరి 21న, పర్యావరణ విద్యపై 23న పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్, సీబీఎస్‌ఈ విధానం అమలుచేస్తుండడంతో కొందరు విద్యార్థులు రెండో భాష స్థానంలో ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకోవడం, ఎంబైపీసీ కోర్సు ప్రవేశం తదితర కారణాలతో ఒకరోజు ఒక పేపర్ విధానంలో పరీక్షలు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అలాగే, గతేడాది ఫెయిలైన విద్యార్థులకు అనుగుణంగా బ్యాక్‌లాగ్ పేపర్లు పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఇదిలా ఉంటే.. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 10 వరకు అధికారులు గడువునిచ్చారు. అపరాధ రుసుంతో ఈనెల 20 వరకు చెల్లించవచ్చు.
మొదటి ఏడాది పరీక్షల షెడ్యూల్ ఇదీ..
ఫిబ్రవరి 23 తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/తవిుళం/ ఒరియా/కన్నడ/అరబిక్/ఫ్రెంచ్/పర్షియన్
బ్యాక్‌లాగ్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1
25–2–2026: ఇంగ్లిష్
బ్యాక్‌లాగ్ : ఇంగ్లిష్
27–2–2026 : చరిత్ర
బ్యాక్‌లాగ్ : బోటనీ, చరిత్ర
మార్చి 2 : మేథమెటిక్స్
బ్యాక్‌లాగ్ : మేథమెటిక్స్ 1ఏ
5–3–2026 : బయాలజీ
బ్యాక్‌లాగ్ : మేథమెటిక్స్ 1బి, జువాలజీ
7–3–2026 : ఎకనావిుక్స్
బ్యాక్‌లాగ్ : ఎకనావిుక్స్
10–3–2026 : ఫిజిక్స్
బ్యాక్‌లాగ్ : ఫిజిక్స్
12–3–2026 : కామర్స్
బ్యాక్‌లాగ్ : కామర్స్/సోషియాలజీ/ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
14–3–2026 : సివిక్స్
బ్యాక్‌లాగ్ : సివిక్స్/మ్యాథమెటిక్స్ (బ్రిడ్జి కోర్సు)
17–03–2026 : కెమిస్ట్రీ
బ్యాక్‌లాగ్ : కెమిస్ట్రీ
20–3–2026 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ (రెగ్యులర్ అండ్ బ్యాక్‌లాగ్)
24–3–2026 : మోడ్రన్ లాంగ్వేజ్/జియోగ్రఫీ (రెగ్యులర్ అండ్ బ్యాక్‌లాగ్)
సెకండియర్ షెడ్యూల్ ఇలా..
24–2–2026 : సెకండ్ లాంగ్వేజ్
26–2–2026 : ఇంగ్లిష్
28–2–2026 : బోటనీ/హిస్టరీ
3–3–2026 : మేథమెటిక్స్ 2ఎ/సివిక్స్
6–3–2026 : జువాలజీ/ ఎకనావిుక్స్
9–3–2026 : మేథమెటిక్స్ 2బి
11–3–2026 : కామర్స్/సోషియాలజీ/ ఫైన్ ఆర్ట్స్/మ్యూజిక్
13–3–2026 : ఫిజిక్స్
16–3–2026 : మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ/మ్యాథమెటిక్స్–2(బ్రిడ్జి కోర్సు)
18–3–2026 : కెమిస్ట్రీ
23–3–2026 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్