ఏపీ: ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్‌ అధికారి పిల్లలు

IAS Officer prabhakar Reddy Joins His Childrens In Government School Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ పాఠశాలలో చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్‌ చేశామని ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్కూల్‌లో వసతులు, క్లాస్‌రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ అన్నీ చాలా బాగున్నాయన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా  వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. 

కాగా వేసవి సేలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు మంగళవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. విజయవాడలో పడమట పాఠశాలలో గతేడాది నాలుగు వందల మందికి పైగా కొత్తగా విద్యార్థులు చేరగా.. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్తగా చేరనున్నట్లు అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top