పుంగనూరు ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ 

huge rally in Proddutur to protest Punganur incident - Sakshi

ప్రొద్దుటూరు: పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోలీసులపై, ప్రజలపై రాళ్లతో దాడులు చేయించినందుకు నిరసనగా ఆదివారం పుట్టపర్తి సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లర్ల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపి ఉంటే ఎన్నో కుటుంబాలకు గర్భశోకం మిగిలేదని, సంయమనంతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పోలీసులు గ్రేట్‌ అని అభినందిస్తూ వారికి సెల్యూట్‌ చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top