తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

Nov 6 2024 6:57 AM | Updated on Nov 6 2024 6:57 AM

Huge Devotees Rush At Tirumala

తిరుమల : తిరుమలలో  పెరిగిన భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్‌లో 17 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 68,146 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,667 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో  దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 5 గంటల్లో దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.  

నేడు టిటిడి నూతన చైర్మన్ గా భాద్యతలు చేపట్టనున్న బిఆర్ నాయుడు
టిటిడి చైర్మన్ తో పాటు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్న

వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 

ఎమ్మెస్ రాజు సాంబశివరావు

 జంగా కృష్ణమూర్తి 

దర్శన్ 

శాంతారాం 

రామమూర్తి 

జానకి దేవి

 మహేంద్ర రెడ్డి 

ఆనంద్ సాయి

 నరేష్ కుమార్

 అదిథ్ దేశాయ్ 

సౌరబ్ బోరా

 నర్సిరెడ్డి 

రాజశేకర్ గౌడ్

 

 

Advertisement
 
Advertisement
Advertisement