ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు.. | Heavy Rains Lash United Visakhapatnam District | Sakshi
Sakshi News home page

ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు..

May 1 2026 7:12 PM | Updated on May 1 2026 7:21 PM

Heavy Rains Lash United Visakhapatnam District

విశాఖ : ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమిలి, తగరపువలస, అనకాపల్లి, మాడుగులలో కుండపోత వాన పడింది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పద్మనాభంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో  వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఫలితంగా వర్షాలు పడుతున్నాయి.  ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు.

ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement